తెలంగాణ ఏసీబీ వలలో జగిత్యాల డీటీవో..22వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు
విధాత : రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కోరుట్లకు చెందిన జేసీబీ ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ దాడి నిర్వహించింది. పట్టుకున్న జేసీబీని వదిలేందుకు డీటీవో భద్రూనాయక్ రూ.35వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి తన డ్రైవర్ అరవింద్ ద్వారా భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో పాటు పట్టుకున్నారు. డీటీవోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram