కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు : కడియం శ్రీహరి

తెలంగాణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కాస్తంతా కూడా సిగ్గులేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ, కించపరుస్తూ అడుగడుగునా విషం చిమ్ముతోందని విమర్శించారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:  తెలంగాణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కాస్తంతా కూడా సిగ్గులేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ, కించపరుస్తూ అడుగడుగునా విషం చిమ్ముతోందని విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఆదివారం ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే మహిళా బిల్లుకు లింక్ పెట్టి డిలీమిటేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశ పెడితే ఏకగ్రీవంగా ఆమోదం లభించేదని తెలిపారు. మహిళా బిల్లు పాస్ కావాలని బీజేపీ ఎంత మాత్రం లేదని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గించడం కోసమే డిలీమిటేషన్ బిల్లు తీసుకువచ్చిందని ఆరోపించారు. డిలీమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ నాయకులు అడుగడుగునా అవమానిస్తున్నారని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన రోజును బ్లాక్ డే అని, ఇండియా పాకిస్తాన్ ను విడగొట్టినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లను విడగొట్టారనే దుర్మార్గపు మాటలతో తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం గడిచిన 12ఏళ్లలో తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని అన్నారు. బీజేపీ ప్రతిదీ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప మహిళలు, పేద ప్రజల అభివృద్ధి కోసం కాదని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏడవెల్లి లావణ్య మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలూకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, హోసింగ్ శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపిడివో,డీపీఎం, ఎపిఎంలు, మహిళ సంఘాల ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Latest News