కంచ గచ్చిబౌలి భూముల కేసు ఆగస్టు 13కి వాయిదా

న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కి వాయిదా పడింది. కంచ గచ్చిబౌలి భూములలో పర్యావరణ పరిరక్షణ చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆగస్టు 13కి వాయిదా వేసింది.
కంచ గచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా.. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలతో కంచ గచ్చిబౌలి భూములలో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది.