కన్నెపల్లి కేజీబీవీలో కలుషితాహారం.. 12 మంది విద్యార్థినులకు అస్వస్థత

కన్నెపల్లి కేజీబీవీలో కలుషితాహారం.. 12 మంది విద్యార్థినులకు అస్వస్థత

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం కలుషితాహారం తిని 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థినులను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారం తినడం వల్లనే అస్వస్థతకు గురైయారు.


శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, తలనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కేజీబీవీ ఎస్ఓ వినీత స్పందిస్తూ, ఫుడ్ పాయిజన్ కాలేదని తెలియజేశారు. హాస్టల్ పక్కనే ఉన్న వాగులో తరచూ మృతదేహాలను దహనం చేయడం వల్ల పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. బాధిత విద్యార్థినులను బెల్లంపల్లి నియోజకవర్గ సీపీఐ నాయకులు రేగుంట చంద్రశేఖర్ పరామర్శించారు.