Karnataka road accident| కర్ణాటక రోడ్డు ప్రమాదంలో.. నలుగురు తెలంగాణవాసుల మృతి

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. కర్ణాటక హల్లిఖేడ్‌లో రోడ్డులో వ్యాను, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తెలంగాణవాసులు మృతి చెందారు.

Karnataka road accident| కర్ణాటక రోడ్డు ప్రమాదంలో.. నలుగురు తెలంగాణవాసుల మృతి

విధాత : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం(Karnataka road accident)లో నలుగురు తెలంగాణ వాసులు( Telangana people died) దుర్మరణం చెందారు. కర్ణాటక హల్లిఖేడ్‌లో రోడ్డులో వ్యాను, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తెలంగాణవాసులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా గుర్తించారు. వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.