Kavitha| ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయాలి : కవిత

తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల స్మృతిలో తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన కవిత స్వయంగా రక్త దానం చేశారు.

Kavitha| ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయాలి : కవిత

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి(Telangana Jagrithi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల స్మృతిలో తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని(blood donation camp) ప్రారంభించిన కవిత స్వయంగా రక్త దానం చేశారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అప్లికేషన్స్ పెట్టుకోవాలంటూ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారే తప్పా..హామీల అమలుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కనీసం రాష్ట్రావతరణ రోజున ఉద్యమకారులు, వారి కుటుంబాలను గౌరవించిన పాపాన పోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు చెప్పినట్లుగా డిసెంబర్ 9 నాడు హామీల అమలుపై ప్రకటన చేయాలని కోరారు. ఉద్యమకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో కవిత చేపట్టిన జనం బాట కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ లేని జిల్లాల వారిగా తిరిగా జనంబాట యాత్రను డిసెంబర్ నాలుగో తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్ లో కవిత గారు జనంబాట యాత్ర ప్రారంభించారు. మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ – హన్మకొండ, నల్గొండ, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి, వనపర్తి, కామారెడ్డి జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఎన్నికల కోడ్ రావడంతో యాత్ర నిలిపివేశారు.

జనం బాట కొత్త షెడ్యూల్

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ లేని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో డిసెంబర్ నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు యాత్ర నిర్వహించనున్నారు. ఈమేరకు తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం సవరించిన షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలో డిసెంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు యాత్ర చేపడుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18, 19 తేదీల్లో, గద్వాల జిల్లాలో 21, 22 తేదీల్లో యాత్ర నిర్వహిస్తారు. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సూర్యాపేట, సిరిసిల్ల, జనగామ, భూపాలపల్లి, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జగిత్యాల, మహబూబాబాద్, నిర్మల్, నారాయణపేట, సిద్ధిపేట, మంచిర్యాల జిల్లాలో ఫిబ్రవరి మూడో వారం వరకు యాత్ర కొనసాగిస్తారు.