రైతుబంధుపై కేసీఆర్ ట్వీట్‌ దాడి.. తుమ్మల వ్యాఖ్యలే అస్త్రం

రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తనకు ఇంకా రైతు బంధు రాలేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను

రైతుబంధుపై కేసీఆర్ ట్వీట్‌ దాడి.. తుమ్మల వ్యాఖ్యలే అస్త్రం

విధాత, హైదరాబాద్ : రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తనకు ఇంకా రైతు బంధు రాలేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు.

ఇవాళ ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. ఈ సందర్భంగా తన పక్కనే కూర్చుని ఉన్న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చూపిస్తూ నాకే ఇంకా కొంత రైతు బంధు రాలేదని.. ఈ విషయాన్ని భట్టి విక్రమార్కను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాక ఇస్తా అన్నాడని చెప్పారు. ఈ వీడియోను కేసీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. రైతు బంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఈ విషయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటనతోనే స్పష్టం అవుతోందని ఆరోపించారు. కేసీఆర్ ట్విటర్ ఖాతాలో అడుగుపెట్టకా ప్రభుత్వంపై వరుస పోస్టులతో విరుచుకపడుతుండగా, ఆయన లేవనెత్తిన సమస్యల చుట్టు విస్తృత చర్చ సాగుతుంంది. దీంతో తెలంగాణ ఉద్యమకారుడిగా, తొలి సీఎంగా, ప్రతిపక్ష నేతగా పలు బాధ్యతలలో ఒదిగిన కేసీఆర్ ఇక ట్విటర్ ఫైటర్‌గా బిజీగా మారుతున్నారంటున్నారు నెటిజన్లు.