కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పీఏ లగ్జరీ లైఫ్ వైరల్

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీఏ లగ్జరీ లైఫ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి పీఏ పబ్బు రాజు గౌడ్ కొత్తగా డిఫెండర్ కారు కొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం వివాదాస్పదమై ట్రోలింగ్ కు గురవుతుంది.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీఏ లగ్జరీ లైఫ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి పీఏ పబ్బు రాజు గౌడ్ కొత్తగా డిఫెండర్ కారు కొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం వివాదాస్పదమై ట్రోలింగ్ కు గురవుతుంది.

రాజ్ గోపాల్ రెడ్డి పీఏ పబ్బు రాజు ఇటీవల కాలంలో మునుగోడు, చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు చోటుచేసుకున్నాయి. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన పలువురు వ్యాపారవేత్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించాడని బాధితులు తమ గోడు వెళ్లగక్కుతున్నారని ప్రచారం సాగుతుంది. తాము కష్టపడి సంపాదించిన డబ్బులను.. వసూలు చేసి పీఏ పబ్బు రాజు లగ్జరీ జీవితం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ సాగుతుంది.

సొంత కాంగ్రెస్ పార్టీతో పాటు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే వ్యాపారవేత్తలను కూడా బెదిరించి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో రాజ్ గోపాల్ రెడ్డి ఓడిపోతే దానికి పబ్బు రాజు గౌడ్ ప్రధాన కారణమని మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది. అసలే మంత్రి పదవి రేసులో ఉన్న రాజగోపాల్ రెడ్డికి పీఏ లగ్జరీ లైఫ్ వ్యవహారం తలనొప్పిగా మారిపోయిందంటున్నాయి పార్టీ శ్రేణులు.

రాజగోపాల్ రెడ్డికి పీఏల గండం !

గతంలో భువనగిరి ఎంపీగా, మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరించిన కాలంలో సైతం అప్పటి పీఏ వ్యవహారం కూడా ఇదే రీతిలో వివాదాస్పదమైంది. ఆనాటి పీఏ తనే రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా వ్యవహరించడం..మండల, నియోజకవర్గాల నాయకులకు సైతం రాజగోపాల్ రెడ్డితో మాట్లాడే అవకాశం కల్పించకుండా సర్వం తానై వ్యవహరించం అప్పట్లో వివాదాస్పదమై సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. అప్పట్లో రాజగోపాల్ రెడ్డి ఆయా ఎన్నికల్లో ఓటమికి బలమైన కారణాల్లో పీఏపై వ్యతిరేకత కూడా ఒకటిగా నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు పబ్బు రాజు అనే పీఏతో అలాంటి వ్యతిరేకతను రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరందుకుంది.

అన్న వెంకట్ రెడ్డి వద్ద సైతం అదే రగడ..

ఇటు రాజగోపాల్ రెడ్డి అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన హైదరాబాద్, నల్లగొండలలోని పీఏలు కూడా అదే తరహలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పీఏలు, పీఆర్వోల వ్యవహార శైలితో విసుగెత్తిపోయిన నాయకులు, కార్యకర్తలు వారిపై కోపాన్ని కాస్తా…కోమటిరెడ్డి బ్రదర్స్ పై కోపంగా మార్చుకుని ఎన్నికల సమయంలో వారి ఓటమికి చేతనైనంతా చేస్తామంటూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లుగా సొంత కేడర్ లోనే ప్రచారం వినిపిస్తుండటం ఆసక్తికరం.

మంత్రులకు తప్పని పీఏ, పీఆర్వోల సెగలు

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు పీఏలు, పీఆర్వోల వ్యవహరశైలీతో  ప్రజలకు, కేడర్ కు, మీడియాకు దూరమై ప్రతికూలతను మూటకట్టుకుని రాజకీయంగా నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా తమ పీఏలు, పీఆర్వోలతో ఆయా వర్గాల నుంచి వ్యతిరేకతను పోగేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్,  ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పీఏలు, పీఆర్వోలతో కావాల్సినంతా బద్నామ్ అయిపోయారు.

పీఏలు, పీఆర్వోల అనుచిత వ్యవహరశైలీ ప్రజాప్రతినిధులతో పాటు పార్టీకి నష్టదాయకంగా మారిపోతుంది. పీఏలు, పీఆర్వోలు ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి వారి ప్రవర్తన, సంపాదనలలో భారీ వ్యత్యాసాలు కనిపించడం సన్నిహితులను సైతం ఆశ్చర్యపరుస్తుందట. ఇకనైనా అధికార కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పీఏలు, పీఆర్వోల పనితీరుపై కన్నేసి.. సొంత కేడర్, మీడియా నుంచి వ్యతిరేకత ముప్పు తప్పించుకుంటే మంచిదని..లేదంటే నష్టం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి :

ట్రెండింగ్.. పీవీ సింధూ “టెంపుల్” క్లిప్ !
Kurchi Thatha | కుర్చీ తాత కన్నుమూత.. ఒక్క డైలాగ్‌తో స్టార్‌గా మారిన మహ్మద్ పాషా ఇక లేరు

Latest News