విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్‌లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద ఆయన మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేపట్టారు. ‘తిరగబడర సామీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్‌మీట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. మా ప్రేమ, పెళ్లికి సంబంధించి అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రాజ్‌తరుణ్‌తో మాట్లాడటానికి వచ్చానని, తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్లనని గేటు వద్దనే నిరీక్షించారు. హిరోయిన్ మాల్వీ మల్హొత్ర నా భర్తను వశం చేసుకుని నాకు అన్యాయం చేసిందని, రాజ్‌తరుణ్‌తో నా బంధాన్ని తెంచేసిందని ఆరోపించారు. పోలీసులు ఈ కేసులో నాకు న్యాయం చేయాలన్నారు. మే 11 అతని బర్త్‌డే, మా పెళ్లి రోజు ఒకటేనని, ఈ ఏడాది నా భర్తను రాకుండా మాల్వీ అడ్డుపడిందని ఆరోపించారు.