Liquor Lorry Catches Fire In Hyderabad | మద్యం లారీలో మంటలు..మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

హైదరాబాద్లో మద్యం లోడ్ లారీ మంటల్లో తగలడంతో, బాటిళ్ల కోసం జనం ఎగబడి రచ్చ చేశారు; దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Liquor Lorry Catches Fire In Hyderabad | మద్యం లారీలో మంటలు..మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

విధాత, హైదరాబాద్ : సాధారణంగా ట్రాన్స్ పోర్టు లారీలు రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భాల్లో వాటిలో రవాణా అవుతున్న సరుకులు రోడ్డుపైన పడిపోగానే వాటి కోసం జనం ఎగబడటం చూస్తుంటాం. ఎక్కువగా ఆహార పదార్దాలు..కూల్ డ్రింక్స్, చమురు ట్యాంకర్లు బోల్తాపడిన సందర్బాల్లో ఈ తరహా దృశ్యాలు చోటుచేసుకోవడం కనిపిస్తుంటుంది. ఈ సారి మద్యం లోడ్ లారీకి ఆ పరిస్థితి ఎదురైంది.

హైదరాబాల్ లోని రామంతాపూర్ స్పూర్తి కళాశాల వద్ధ మద్యం లోడ్ తో వెలుతున్న లారీలో మంటలు చెలరేగాయి. అందులోని లిక్కర్ బాటిళ్లు మంటల్లో తగలబడ్డాయి. ఈ క్రమంలో మద్యం బాటిళ్ల కోసం మంటలను సైతం లెక్కచేయకుండా జనం ఎగబడ్డారు. దొరికిన కాడికి..మద్యం బాటిళ్లను తీసుకుని దసరా పండుగకు ఫ్రీగా మందు దొరికేసిందనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.