Avika Gor marries Milind Chandwani | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి అవికా గోర్
నటి అవికా గోర్ తన ప్రియుడు మిళింద్ చద్వానీని వివాహం చేసుకుంది. పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విధాత: నటి అవికాగోర్ వివాహబంధంలోకి అడుగు పెట్టింది. మంగళవారం తన ప్రియుడు మిళింద్ చద్వానీని అవికా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి విషయాన్ని వెల్లడిస్తూ చేస్తూ తాజాగా అవికా పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్, ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అవికా గోర్..తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష‍్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ లాంటి తెలుగు సినిమాలలో అలరించింది. అవికా నటించిన చిత్రం ‘షణ్ముఖ’ మార్చిలో విడుదలైంది.
2019లో సామాజిక కార్యకర్త అయిన మిళింద్‌తో ఏర్పడిన పరిఛయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి కూడా చేసుకోవడంతో…నెట్టింటా వారి పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు వారికి వివాహా శుభకాంక్షలు తెలియచేస్తున్నారు.