Love Jihad crime| లవ్ జిహాద్ వలలో మరో యువతి విలవిల

ఇతర మతాలకు చెందిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది సాగిస్తున్న లవ్ జిహాద్ వలకు చిక్కి దారుణంగా మోసపోయిన మరో యువతి ఘటన వెలుగు చూసింది.

విధాత, హైదరాబాద్ : ఇతర మతాలకు చెందిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది సాగిస్తున్న లవ్ జిహాద్ వలకు చిక్కి దారుణంగా మోసపోయిన మరో యువతి ఘటన వెలుగు చూసింది. కూకట్‌పల్లికి  చెందిన ఓ యువతిని టార్గెట్ గా చేసుకుని నవాజ్ అనే వ్యక్తి  ముందుగా ఓ ఇల్లు అద్దెకు కావాలంటూ ఓ యువతికి పరిచమయ్యాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ వెంటపడి.. తాను కూడా హిందువునే అని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు.  2025 జూన్‌లో వారి పెళ్లి జరిగిపోగా.. పెళ్లి రోజు రాత్రే ఆ అమ్మాయికి నవాజ్ మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి.. మరో నలుగురు స్నేహితులు, సోదరులతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత ఆ యువతిని నవాజ్ బెదిరించి మతం మార్చి, బలవంతంగా బీఫ్ తినిపించి హింసించాడు. వివాహం అనంతరం ఈ జంట కూకట్‌పల్లి నుండి పంజాగుట్టకు మకాం మార్చారు.

యువతితో పాటు ఆమె  కుటుంబ స‌భ్యులను నవాజ్ వేధించడం మొదలు పెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నవాజ్ ఆరాచాకాలను తట్టుకోలేకపోయిన యువతి, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తన ఆస్తులు, తన కుటుంబ ఆస్తులను సైతం అమ్ముకుని నవాజ్ పారిపోయినట్లుగా పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Latest News