పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు
పెద్దపల్లి జిల్లా ఇందుర్తిలో వరి కొయ్యల మంటలు ధాన్యం కుప్పలకు అంటుకుని రూ.20 లక్షల విలువైన విత్తన ధాన్యం బుగ్గిపాలైంది.
వేసవిలో రైతులు పంట వ్యర్ధాలను తగులబెట్టే క్రమంలో, విద్యుద్ఘాతాలతో పెద్ద ఎత్తున తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అగ్నిప్రమాదాలో రైతుల పంటలు, సాగు పరికరాలు, పంట నిల్వలు నష్టపోతున్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు..గాలికి ఎగసిపడి చేతికొచ్చిన ధాన్యం కుప్పలకు అంటుకుంది.
ఈ ప్రమాదంలో నలుగురు రైతులకు చెందిన విత్తన ధాన్యం పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లింది. రైతులు వెంటనే ట్రాక్టర్లతో నీటిని తెచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇవి కూడా చదవండి :
ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్..మూడు సరికొత్త ‘భారత్ గౌరవ్’ ప్యాకేజీలు!
షాకింగ్…‘కాక్రోచ్ జనతాపార్టీ’ ఎక్స్ ఖాతా నిలిపివేత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram