Malla Reddy | అమెరికా కోర్సులను మా యూనివర్సీటీల్లో తెస్తా: మాజీ మంత్రి మల్లారెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తనదైన శైలీలో హడావుడి చేస్తున్నారు

  • Publish Date - May 31, 2024 / 05:17 PM IST

విధాత : అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తనదైన శైలీలో హడావుడి చేస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న 2024 అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన్న మాల్లారెడ్డి అక్కడి యూనివర్సిటీల పనితీరు, బోధిస్తున్న కోర్సులను, వివిధ దేశాల యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సదస్సులో మాట్లాడిన మల్లారెడ్డి ప్రపంచంలోని పెద్ద యూనివర్సిటీలన్ని ఈ సదస్సుకు వచ్చాయని, చైనా, జపాన్, పోర్చుగల్, భారత్ దేశాల్లో ఉండే వర్సిటీలు వారి వారి స్టాల్స్ ఏర్పాటు చేశారని, కోర్సుల గురించి ప్రెజెంటేషన్‌ చేస్తున్నారని తెలిపారు.

ఇందులో తెలంగాణ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన స్టాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలతో ఎక్చేంజ్‌ ఆఫర్స్, వారి కోర్సులు, న్యూ ఎడ్యూకేషన్ పాలసీలపై పరస్పర మేధో మార్పిడికి ఈ సదస్సు చక్కని వేదికగా మారిందన్నారు. ప్రపంచానికి తగ్గట్టుగా యువతను తయారు చేసే డిజిటల్ హెల్త్ లాంటి కొత్త కోర్సులను మల్లారెడ్డి వర్సిటీలో తేబోతున్నట్లు వెల్లడించారు.

Latest News