Bade Chokka Rao : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు?
ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌లో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు సహా 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టులకు ఇది భారీ ఎదురుదెబ్బ.
విధాత, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ )లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం. పట్టుబడిన వారిలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.
పట్టుబడిన మావోయిస్టులలో 9మంది మహిళలు కాగా, ఆరుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31లోపు మావోయిస్టు రహిత భారత నిర్మాణం లక్ష్యంగా సాయుధ బలగాలతో, ఆధునిక టెక్నాలాజీతో మావోయిస్టుల ఏరివేత కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. దీనికి తోడుగా పలువురు కీలక నేతలు సహా వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడం మరో ఎదురు దెబ్బగా పరిగణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
IndiGo crisis Marxist analysis | ఇండిగో సంక్షోభం లేవనెత్తే ప్రశ్నలు, నేర్పే పాఠాలు – ఒక విశ్లేషణ
Kishan Reddy | లీకు వీరులు.. మెంటల్ వాళ్లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram