Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఎగిసిపడ్డ అగ్నికీలలు.. ఐదు ఇళ్లు, రెండు గోదాములు దగ్ధం
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్ పద్మశాలీ కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్ పద్మశాలీ కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న దుకాణంతో పాటు ఐదు ఇండ్లకు వ్యాపించాయి. అప్రమత్తమైన నివాసితులు తమ ఇండ్ల నుంచి బయటకు పరుగెత్తుకు వచ్చారు. ఆ దట్టమైన పొగకు పలువురు అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఎనిమిది ఫైరింజన్లు గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. స్పృహ కోల్పోయిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాద ఘటన ఆ ప్రాంతమంతా ప్యానిక్‌గా మారింది. ఈ అగ్నికీలలకు రెండు గోదాములు, ఐదు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram