Matangi Swarnalatha | నేను కన్నెర్రజేస్తే చస్తారు.. మాతంగి స్వర్ణలత ఘాటైన హెచ్చరికలు
Matangi Swarnalatha | ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలి. నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు అని మాతంగి స్వర్ణలత( Matangi Swarnalatha ) భవిష్యవాణి( Bhavishyavani ) వినిపించారు.

Matangi Swarnalatha | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి( Ujjaini Mahankali ) జాతర సందర్భంగా మాతంగి స్వర్ణలత( Matangi Swarnalatha )అమ్మవారు ఘాటైన హెచ్చరికలు చేశారు. రంగం( Rangam ) చెబుతూ ఆమె తీవ్రంగా స్పందించారు. గతంలో ఎన్నడూ కూడా స్వర్ణలత అమ్మవారు ఈ స్థాయిలో స్పందించలేదు. సాధారణంగా చెప్పే తీరులో కాకుండా, ఈసారి ఫుల్ ఫైర్ మూడ్‌లో కనిపించారు.
ఎంత చెప్పినా వినక, గోరంత కనికరంతో సరిపెట్టుతున్నారు. నేను కన్నెర్రజేస్తే చస్తారు అని స్వర్ణలత అమ్మవారు హెచ్చరించారు. ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత నాపైనే ఉంది. అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మరోసారి మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉంది. ముందుగానే ముద్దుగా హెచ్చరిస్తున్నాను. నా పిల్లలందరినీ కడుపులో పెట్టుకొని రక్షిస్తున్నాను. కానీ వారి తల్లిదండ్రులే కనికరం లేకుండా వారిని వదిలేస్తున్నారు. చిన్న చిన్న పూజలతో పెద్ద కోరికలు తీరుస్తున్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలి చెప్పండి? ఏటేటా వాగ్దానాలు తీసుకుంటారు. కానీ ఒక్కసారి కూడా నిజంగా నిబద్ధత చూపించరు. అయినా కూడా నేను నా బిడ్డలను కాపాడుతూనే ఉన్నాను. ఈసారి బాలభారతాలు సంతోషంగా ఉంటారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ఈ జాతర ఐదు వారాలపాటు పప్పు, బేళ్లం, ఫలహారంతో జరగాలి. పసుపు, కుంకుమలతో, వేపాకులతో శోభాయమానంగా ఉండాలి. నాలుగు వారాల్లో నా ఎదుట రక్తం చూపించండి. చూపించకపోతే నేను ఊరుకోను అని అమ్మవారు హెచ్చరించారు. అమ్మవారి ఈ భవిష్యవాణి సికింద్రాబాద్(Secunderabad) ప్రజలందరికీ ఆలోచన కలిగించేలా ఉంది. తప్పులు చేయకుండా, భక్తితో జాగ్రత్తగా ముందుకు సాగాలన్న సందేశాన్ని అందించారు.