Traffic Restrictions | నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
Traffic Restrictions | ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మరి ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ మార్గాల్లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- బేగంపేట్ నుంచి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, ప్యాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ మీదుగా వెళ్లాలి.
- బేగంపేట్ నుంచి తిరుమలగిరి వెళ్లే వాహనదారులు.. ఫ్లై ఓవర్ల మీదుగా.. సెయింట్ జాన్స్ రోటరి, షీనోయ్, ఏవోసీ, కేవీ మీదుగా తిరుమలగిరి చేరుకోవాలి.
- బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారు బాలానగర్ జంక్షన్, ఫతేనగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, బేగంపేట్ మీదుగా చేరుకోవాలి. లేదా పంజాగుట్ట, బేగంపేట, రసూల్‌పురా జంక్షన్, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవాలి.
- సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వెళ్లే వాహనదారులు క్లాక్ టవర్, సంగీత్, సెయిల్ జాన్స్ రోటరీ, షినోయ్, ఏవోసీ, కేవీ మీదుగా తిరుమలగిరి చేరుకోవాల్సి ఉంటుంది.
- సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి వెళ్లే వాహనదారులు క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీవో మీదుగా బోయిన్‌పల్లి చేరుకోవాలి.
- ట్యాంక్ బండ్ నుంచి తిరుమలగిరి వెళ్లేవారు ప్యారడైజ్, సీటీవో, తాడ్‌బన్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి మార్కెట్ మీదుగా తిరుమలగిరి చేరుకోవాలి.
మోదీ పర్యటన ఇలా..
- 10న మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు పయనం.
- మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- 2.30 గంటలకు పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.
- మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 4.15 గంటలకు సింధూ ఆస్పత్రి ప్రారంభం.
- సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుంటారు.
- గంట పాటు రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో ప్రత్యేక సమావేశం.
- సాయంత్రం 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
- సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ప్రసంగం.
- సాయంత్రం 6.45 గంటలకు బేగంపేట నుంచి గుజరాత్‌కు బయల్దేరుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram