Rahul Raj | బంగ్లాదేశ్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా కలెక్లర్లకు శిక్షణనిచ్చిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
భారతీయ పాలన, ప్రజా విధానం అనే అంశంపై బంగ్లాదేశ్కు చెందిన డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల కలెక్టర్లకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి: భారతీయ పాలన, ప్రజా విధానం అనే అంశంపై బంగ్లాదేశ్కు చెందిన డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల కలెక్టర్లకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంలోని పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ సుపరిపాలనపై చేపట్టిన చర్యల గురించి పూర్తిస్థాయిలో వివరించారు. గతంలో ఆసిఫాబాద్ కలెక్టర్‌గా తాను పని చేసిన సమయంలో ఇన్నోవేటర్ ప్రోగ్రాంలో భాగంగా వాటి గుర్తింపుగా వచ్చిన ప్రధానమంత్రి అవార్డుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో సుపరిపాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా అందరికీ వివరించారు. విదేశీ అధికారులకు సుపరిపాలనపై అవగాహన కల్పించిన రాహుల్ రాజ్‌ను పలువురు ఉన్నతాధికారులు, బంగ్లాదేశ్ అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా రాహుల్ రాజ్‌ను అభినందిస్తూ మెమొంటో అందించారు. గతంలో దేశంలోనే ఉత్తమ కలెక్టర్‌గా ప్రధాన మంత్రి అవార్డును రాహుల్ రాజ్ అందుకున్న విషయం తెలిసిందే.