ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎంఐఎం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ ప్రకటించారు. ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎంఐఎం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ ప్రకటించారు. తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించిన ఒవైసీ వాటిలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో చాంద్రాయణ గుట్టకు అక్భరుద్ధిన్ ఒవైసీ, నాంపల్లికి మజిద్ హుస్సెన్‌, మలక్‌పేటకు అహ్మద్ బలాల, యాకుత్‌పురాకు జాఫర్ హుస్సెన్‌, చార్మినార్‌కు జుల్ఫీకర్‌, కార్వాన్‌కు కౌసర్ మొహనొద్ధిన్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. రెండు రోజుల్లో బహదూర్‌పూరా, జుబ్లీహిల్స్‌, రాజేంద్ర నగర్ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తామని ఒవైసీ తెలిపారు. యాకుత్‌పూరా సిటింగ్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, చార్మినార్ సిటింగ్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌లకు టికెట్లు నిరాకరించారు. కాగా జూబ్లిహిల్స్‌, రాజేంద్రనగర్‌లలో బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఇక్కడ కూడా ఎంఐఎం పోటీ చేయనుండటంతో ఇక్కడ చతుర్ముఖ పోటీకి బాటలు పడనున్నాయి.ఆ