Konda Surekha Meets Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్ వద్దకు మంత్రి సురేఖ దంపతులు

కొందా సురేఖ, కుమార్తె సుస్మిత ఓఎస్డీ వివాదంపై మీనాక్షి నటరాజన్‌ను కలుసుకొని చర్చించారు. కేబినెట్ భేటీలో హాజరు అనిశ్చితి.

Konda Surekha Meets Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్ వద్దకు మంత్రి సురేఖ దంపతులు

విధాత, హైదరాబాద్ : ఓఎస్డీ వివాదంలో ప్రభుత్వంపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత బహిరంగ విమర్శలు చేసిన నేపధ్యంలో దీనిపై చర్చించేందుకు రావాలని కొండా సురేఖకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. మీనాక్షి ఫోన్ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దంపతులు, సుస్మితలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. అక్కడే ఉన్న మీనాక్షి నటరాజన్ తో సమావేశమయ్యారు. అయితే వివాదం ఇక్కడే సద్దుమణుగుతుందా..మరికొద్ది సేపట్లో జరిగే కేబినెట్ భేటీకి కొండా సురేఖ హాజరవుతారా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

వరంగల్ రాజకీయాల్లో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో విభేదాలు, జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో నెలకొన్న మేడారం టెండర్ల పంచాయతీ, ఓఎస్డీ వివాదాలతో సురేఖ చిక్కుల్లో పడింది. ఈ నేపధ్యంలో ఆమెను సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొనసాగిస్తారా లేదా అన్న అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే మేడారం జాతర పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖకు షాక్ ఇచ్చారు. ఆర్‌అండ్‌బీకి మేడారం జాతర పనులు, రికార్డులు అప్పగించాలని మంత్రి సురేఖకి చెందిన దేవాదాయ శాఖకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.