Telangana Cabinet Meeting : 25న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పంచాయతీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, విద్యుత్ సంస్థలపై కీలక నిర్ణయాలు తీసుకునేరు.

Telangana Cabinet Meeting : 25న తెలంగాణ కేబినెట్ సమావేశం

విధాత, హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు కేబినెట్ స‌మావేశం కానుంది. ఈ భేటీకి మంత్రుల‌తో పాటు ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

డెడికేటెడ్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను కేబినెట్ ఆమోదించే అవ‌కాశం ఉంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 50 శాతానికి మించ‌కుండా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డెడికేటెడ్ క‌మిష‌న్ సిఫార్సు చేసింది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నూతన విద్యుత్ సంస్థల ఏర్పాటు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ప్రజాపాలన ఉత్సవాలపై చర్చించనున్నారు.