డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి: మంత్రి తుమ్మల

డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని, భవిష్యత్‌లో కూలీల కొరత దృష్ట్యా డ్రోన్స్, డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు.

డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి: మంత్రి తుమ్మల

రైతులు మార్కెటింగ్ అవకాశాలు..డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలని అనుసరించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత ఏడాది స్థాపించిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్, టెక్నాలజీ ని సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. భవిష్యత్ వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధికమయ్యే అవకాశం ఉన్నందున డ్రోన్స్ వినియోగం ప్రాముఖ్యతని గుర్తు చేశారు.

SBI – CSR నిధుల సాయంతో అభివృద్ధి చేసిన రోబోటిక్స్ , సెన్సర్ బేస్డ్ ప్రయోగశాలని సందర్శించి ఇప్పటికే కొన్ని రోబోలని వ్యవసాయ రంగంలో ఉపయోగించే విధంగా అభివృద్ధి చేసినందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలని మంత్రి అభినందించారు. C-DAT లో భాగం అయిన RS&GIS ల్యాబ్ ని సందర్శించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి అందించిన ఉపగ్రహ ఆధారిత గణాంకాల గురించి తెలుసుకున్నారు.

60 ఏళ్ల క్రితం ఏర్పాటు అయిన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సహా అనేక మంది మహానుభావుల తోడ్పాటుతో దేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందని తుమ్మల గుర్తు చేవారు. సీఎం రేవంత్ రెడ్డి తోడ్పాటుతో విశ్వవిద్యాలయం ఇంకా పురోగతి సాధిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరామ్,డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ నీలిమ, డాక్టర్ వెంకటేశ్వర్లు,డాక్టర్ జెల్లా సత్యనారాయణ, డాక్టర్ వై.చంద్రమోహన్ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

గుంపు మేస్త్రీ హఠావో….తెలంగాణ బచావో : కవిత
సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త హత్య!