విధాత, హైదరాబాద్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ లోని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లారు. ముందుగా పవన్ నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ ఇటీవల సర్జరీ చేయించుకోవడంతో ప్రధాని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా పవన్, చిరంజీవి సహా కుటుంబ సభ్యులు ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.
అనంతరం ప్రధాని మోదీ జూబ్లీహిల్స్ లోని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు మోదీకి సాదర స్వాగతం పలికి అతిధి మర్యాదలతో సత్కరించారు. ప్రధాని మోదీ తన ఇంటికి రావడం గౌరవంగా భావిస్తున్నాని అంతకుముందు చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొనడం గమనార్హం. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు బయలుదేరారు.
