సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్‌కి వ్యతిరేకంగా నిరసనకు దిగిన పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీస్ అధికారి దౌర్జన్యంగా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్ధులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ రఘుపతిరెడ్డి ఇద్దరు విద్యార్ధులను గొంతు పట్టుకుని నొక్కుతూ వెనక్కి నెట్టడం..వారు ఊపరాడక ఇబ్బంది పడటం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో వారు పోలీసులా? లేక గూండాలా?..విద్యార్ధుల పట్ల ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. విద్యార్థుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ సీఐ తీరుపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. విద్యార్ధులు పట్ల అమానుషంగా వ్యవహరించిన సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని..లేదంటే ఢిల్లీ జంతరమంతర్ జెన్ జీ తరహా నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
విద్యార్థుల గొంతు పట్టుకున్న సీఐ రఘుపతి రెడ్డి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలో పోలీసుల దురుసు ప్రవర్తన
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థుల్లో ఇద్దరి గొంతు పట్టుకుని నెట్టేసిన సీఐ రఘుపతి రెడ్డి https://t.co/fYYo4OZRwS pic.twitter.com/z7y70RGsbf
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
