విధాత, హైదరాబాద్ : అధికారంలో ఉన్నన్నాళ్లు ఆర్టీసీని మూసివేసే కుట్ర చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు మాపై నిందలు వేయడం ఏమిటని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శాసన సభలో ఆర్టీసీ మనుగడకు సంబంధించి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. సమ్మె చేసినా..కార్మికులు చనిపోయిన బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని, కార్మిక సంఘాలను లేకుండా చేసి వారి గొంతు నొక్కారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీకి సంవత్సరానికి 1500 కోట్లు ప్రకటించి 10 ఏళ్లలో 7 వేల కోట్లు కూడా ఇవ్వలేదు.. మేము రెండు సంవత్సరాల్లోనే రూ. 7800 కోట్లు చెల్లించాం అని పొన్నం వెల్లడించారు. మహా లక్ష్మీ పథకంతో మహిళలకు ఇప్పటికే 9వేల కోట్ల ఉచిత ప్రయాణం అందించడం ద్వారా ఆర్టీసీకి జీవం పోశామని గుర్తు చేశారు.
2014లో 10,406బస్సులుంటే బీఆర్ఎస్ హాయంలో 1000బస్సులు తగ్గిపోయాయని, మళ్లీ కాంగ్రెస్ వచ్చాక బస్సుల సంఖ్య పెంచడం జరిగిందన్నారు. కొత్తగా 323 రూట్లు ప్రారంభించామని, రోజు 62లక్షల ప్రయాణికులతో బస్సులు, 32వేల కిలోమీట్లరు ప్రయాణిస్తున్నాయన్నారు. రెండు కొత్త డిపోలను ఏర్పాటు చేశామన్నారు. 1000వరకు కారుణ్య నియామకాలు చేశామని, 250పైగా తొలగింపు ఉద్యోగులను తిరిగి తీసుకున్నామని, మరో 4,500ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సమ్మె విస్మరించలేనిదని పొన్నం గుర్తు చేసుకున్నారు. ఆర్టీసీని ప్రభత్వంలో విలీనం చేయడంపై కమిటీ వేశామని పునరుద్ఘాటించారు. కోర్టులో గుర్తింపు సంఘాలకు సంబంధించిన వివాదం కోర్టులో ఉందని, ప్రభుత్వంలో విలీనమైతే యూనియన్లు మాత్రమే ఉంటాయన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఏ సమస్య ఉన్న మేం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పనిభారం సహా పలు డిమాండ్లపై స్పందించామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ 50వేల కుటుంబాలకు ఈ సభా వేదిక ద్వారా ప్రభుత్వం భరోసా ఇస్తుందని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పొన్నం స్పష్టం చేశారు.
పేద వర్గాలకు ఆర్టీసీ లైఫ్ లైన్
హైదరాబాద్ లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు నడుపుతున్నాం.. వచ్చే రెండు సంవత్సరాల్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం అని పొన్నం తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సుల సబ్సీడిని ఆర్టీసీకి ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు. పేద వర్గాలకు ఆర్టీసీ లైఫ్ లైన్ వంటిదన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను అక్కున చేర్చుకుంటుందని, వారి సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చిన్న బస్సులను నడిపించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
అసెంబ్లీలో శివుడి కుటుంబ ఫోటో ప్రదర్శించిన మంత్రి పొన్నం
శివుని కుటుంబంలోనే ఎన్నో వైరుధ్యాలుంటాయని, నెమలికి పాముకు పడదు, ఎద్దుకు సింహానికి పడదు అని, కానీ వారంతా కలిసి ఒక పరివారంగా ఉంటారని పొన్నం శివుడి కుటుంబం ఫోటో ప్రదర్శనతో వివరించారు. బీసీల సమస్యలపై చర్చ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ…ఎంత వైరుధ్యం ఉన్నా, ఎన్ని అంశాలున్నా..శివుడి కుటుంబంలా మనమంతా కలిసి మెలిసి ఉండాలన్నారు. శివుని కుటుంబం లాగా మనం కూడా బలహీన వర్గాలకు..సంబంధించిన విషయంలో కూడా మనమంతా కలిసి ఉండాలని మంత్రి కోరారు.
ఇవి కూడా చదవండి :
ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం మాటున రేవంత్ సోదరుల భూదందా..వైరల్ గా బీఆర్ఎస్ వీడియో
Barron Trump | శభాష్…ట్రంప్ కుమారుడికి యూకే జడ్జి ప్రశంస!
