పోస్టల్ బ్యాలట్ పత్రాల పంపిణీ సక్రమంగా జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా పోస్టల్ బ్యాలట్ పత్రాలను సర్వీస్ ఓటర్లకు, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు సరిగ్గా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పోస్టల్ బ్యాలట్ పంపిణి, నిర్వహణ మీద కలెక్టర్ గూగుల్ మీటింగ్ ద్వారా రివ్యూ చేసారు.

పోస్టల్ బ్యాలట్ పత్రాల పంపిణీ సక్రమంగా జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా

విధాత, జనగామ :

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా పోస్టల్ బ్యాలట్ పత్రాలను సర్వీస్ ఓటర్లకు, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు సరిగ్గా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పోస్టల్ బ్యాలట్ పంపిణి, నిర్వహణ మీద బుధవారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి జడ్పీ సీఈఓ, డిపి ఓ, అన్ని మండలాల ఎంపీడీఓ లు, తహసీల్దార్ లతో, ఎంపీవో లతో కలెక్టర్ గూగుల్ మీటింగ్ ద్వారా రివ్యూ చేసారు. ముందుగా పోస్టల్ బ్యాలట్ పంపిణీ, నిర్వహణ తదితర అన్ని ప్రక్రియలకు సంబందించి…మాస్టర్ ట్రైనర్ రామరాజు పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా అధికారులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 9 వ తేదీన ఎంపిడిఓ కార్యాలయం లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రం కు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

రెవెన్యూ శాఖ అధికారి.. గెజిటెడ్ అధికారిగా ఫారం 17 లో సంతకం చెయ్యడానికి అందుబాటులో ఉంటారన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారి.. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తారన్నారు. ఎవరికి అయితే పోస్టల్ బ్యాలట్ ఇస్తున్నామో వారి వివరాలు ఒక రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. ఓటరు సహాయక కేంద్రంలో ఓటింగ్ గోప్యతకు భంగం కలగకుండా ఓటింగ్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేయాలన్నారు. సర్వీస్ ఓటర్లకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా తయారు అయిన తర్వాత 24 గంటల్లోపు పోస్ట్ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారి పంపాలని సూచించారు. వివరాలను రికార్డు చేయాలి అని సూచించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ తిరిగి mpdo కార్యాలయం కు చేరినపుడు సంబంధిత ఎన్నికల అధికారి చేరిన సమయం తేదీ రికార్డు చేయాలని, కౌంటింగ్ కు సమయానికి ఒక గంట ముందు చేరిన అన్ని పోస్టల్ బ్యాలెట్ లను కౌంటింగ్ కు అనుమతిస్తారన్నారు.

జిల్లా స్థాయి లో కలెక్టరెట్ AO, మండల స్థాయిలో తాహసీల్దార్ లు నోడల్ ఆఫీసర్ గా ఉంటారని, మొత్తం ప్రక్రియ వీడియోగ్రఫి చేయలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు కూడా ఈ ప్రక్రియ ను పరిశీలించవచ్చని తెలిపారు. పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎంపిడిఓ లను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల లో photo voter slip పంపిణీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 6 న పోలింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో అభ్యర్థుల తో ఎన్నికల వ్యయానికి సంబంధించిన అవగాహన కార్యక్రమ మును ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమ లో అభ్యర్థులు, మండల స్థాయి అధికారులు అభ్యర్థులు పాల్గొనాలని సూచించారు.