గుర్తు కొస్తున్నాయి… కమ్మరి కొలిమిలో డీఎస్పీ చిన్ననాటి జ్ఞాపకాల నెమరు
చిన్నతనంలో చేసిన కుల వృత్తిని గుర్తు చేసుకుంటూ వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లకు పదును పెట్టి ముచ్చట తీర్చుకున్నారు.

విధాత, హైదరాబాద్ : చిన్నతనంలో చేసిన కుల వృత్తిని గుర్తు చేసుకుంటూ వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లకు పదును పెట్టి ముచ్చట తీర్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మల్యాల గ్రామానికి విధుల నిమిత్తం వెళ్లిన డీఎస్పీ నాగేంద్రచారి కమ్మరి కొలిమిని చూసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఖాకీ డ్రెస్‌లోనే కొలిమి పనిచేస్తూ కమ్మరిగా మారిపోయారు. ప్రస్తుతం చేస్తున్న వృత్తి ఏదైనా చిన్ననాటి తమ కులవృత్తిపై చిన్నచూపు వహించకుండా మమకారం చాటుకున్న డీఎస్పీ పెద్ద మనసును స్థానికులు అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.