Site icon vidhaatha

మా ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది

విధాత‌: కాంగ్రెస్ నేతల ఫోన్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావు ఖాసిం రిజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ సూచనతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకుంటోందని రేవంత్ పేర్కొన్నారు.

Exit mobile version