ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం.. సమ్మె ఉద్రిక్తం!

ఆర్టీసీ సమ్మె మధ్య వరంగల్‌లో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వరంగల్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మె రెండో రోజు కూడా ఉదృతంగా కొనసాగింది. కార్మికుల నిరసనలు..పోలీసుల అడ్డంకుల మధ్య జోరందుకుంది. సమ్మె క్రమంలో వరంగల్ జిల్లాలో ఆర్టీసీ నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఉద్రిక్తత రేపింది. శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నంలో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. నడుస్తున్న బస్సుల పైకి కార్మికులు దాడికి ప్రయత్నించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్ సిబ్బంది తో కార్మికులను అడ్డుకొని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. బందోబస్తు కోసం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

ఇవి కూడా చదవండి :

కార్ల తయారీలో మారుతీ సుజుకీ రికార్డు..ఏడాదిలో 23.4లక్షల కార్లు!
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

Latest News