Hyderabad rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. చల్లబడ్డ మహానగరం..!

Hyderabad rain | హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గచ్చిబౌలి, మాదాపూర్‌, మియాపూర్‌, కొండాపూర్‌, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, అబిడ్స్‌, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కస్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అంబర్‌పేట్‌, రామాంతాపూర్‌, విద్యానగర్‌, రాంనగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

Reported by: Thyagi | తెలంగాణ‌ | Jun 05, 2024, 7:41 pm IST
Read Time: 3 mins
Hyderabad rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. చల్లబడ్డ మహానగరం..!

Hyderabad rain : హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గచ్చిబౌలి, మాదాపూర్‌, మియాపూర్‌, కొండాపూర్‌, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, అబిడ్స్‌, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కస్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అంబర్‌పేట్‌, రామాంతాపూర్‌, విద్యానగర్‌, రాంనగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం గుండా వెళ్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజులలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు.. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.