Sitarama project | సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌజ్ ట్రయల్ రన్ విజయవంతం.. స్వీచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
సీతారామ ప్రాజెక్టులోని పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్‌కు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్విచ్ ఆన్ చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఈ కార్యక్రమానికి హాజరై గోదావరి తల్లికి పూజలు చేశారు
విధాత, హైదరాబాద్ : సీతారామ ప్రాజెక్టులోని పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్‌కు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్విచ్ ఆన్ చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఈ కార్యక్రమానికి హాజరై గోదావరి తల్లికి పూజలు చేశారు. మూడు మోటార్ల గుండా గోదావరి సాగు జలాలు ఎగిసి పారాయి. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారుతుంటే ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని, సీతారామ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఎంత ఖర్చైనా ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద 10లక్షల ఎకరాలకు సాగునీరందనుందని తెలిపారు. ఈ పథకం వైరా ప్రాంత రైతులకు వరమన్నారు. వైరా రిజయర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఆయకట్టు వరకు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. వైరా కేంద్రంగా ఈ నెల 15న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టుకు చెందిన మూడు పంప్‌హౌజ్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram