Sriram Sagar Project | శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేసి దిగువ గోదావ‌రికి నీళ్లు వ‌దిలిన అధికారులు

Sriram Sagar Project గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90శాతానికి చేరుకుంటున్నది. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల గోదావ‌రికి 37165 క్యూసెక్కుల వ‌ర‌ద వ‌స్తోంది. కాసేప‌ట్లో పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ నిండే అవ‌కాశం ఉంది

  • By: Tech |    telangana |    Published on : Sep 02, 2024 9:05 AM IST
Sriram Sagar Project  | శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేసి దిగువ గోదావ‌రికి నీళ్లు వ‌దిలిన అధికారులు

Sriram Sagar Project | గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్ట్‌కు భారీ వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు ప్రాజెక్ట్ నిండింది. ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి వేసి 34 వేల పైచిలుకు క్యూ సెక్కుల వ‌ర‌ద నీటికి కింద గోదావ‌రికి వ‌దిలారు. వ‌ర్షాలు మ‌రో రెండు రోజుల పాటు కురిసే అవ‌కాశం ఉండ‌డంతో నీటిపారుద‌ల శాఖ అధికారులు గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపారు.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90శాతానికి చేరుకుంటున్నది. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల గోదావ‌రికి 37165 క్యూసెక్కుల వ‌ర‌ద వ‌స్తోంది. గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల‌ని మీడియా, పోలీస్‌, రెవెన్యూ అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

వాట‌ర్ ఫ్లో ఇలా…

SRI RAM SAGAR PROJECT (SRSP)

FRL 1091 ft/332.53 M/80.5 TMC
————————————–
Date: 01-09-2024
Time: 6:00 PM
————————————–
Water Level: 1086.1 ft
Capacity: 63.303 TMC
————————————–
Instant Inflows: 37165 c/s
————————————–
Instant Outflows: 2325 c/s
1) Spillway-Surplus : NIL
2) KMC/GEN: NIL
3) Laxmi canal: NIL
4) Saraswati canal: NIL
5) Evaporation: 594 c/s
6) Mission Bhagiratha : 231 c/s
7) IFFC: 1500 c/s

Kaddam Narayan Reddy Project

Date: 01-09-2024
Time: 6:00 P.M
Level: 695.200/700 Ft
Capacity: 6.408/7.603 TMC

INFLOW: 27282 C/s

LF Canal: 580 C/s
RF Canal: Nil
Losses: 87 C/s
MissionBhageeratha:9 C/s

OUTFLOW:19112 C/S

Surplus discharge:18435 c/s*
No of gates open:5/18
MFD:3,72,000 C/s.
Ayacut: 68150 Ac

Sripada Yellampally Project

Date: 01-09-2024 @06 :00 PM
Level :(+)147.25 / +148.00 M
Capacity: 18.0915 / 20.175 TMC

Total Instant Inflow:129269 c/s
SRSP:Nil c/s
Kaddem: 37946 c/s
Catchment: 91323 c/s

Total Instant Outflow:144714 c/s
Gudem PH : Nil c/s
HMWS : 304 c/s
NTPC PH:Nil c/s
Vemunur PH: Nil c/s
Nandi PH: 9450 c/s
Through gates : 134960 c/s
No.of gates open: 20/62

LOWER MANAIR DAM

Date: 01.09.2024 @ 06.00 PM
Level: 276.41/ 280.480 mtrs**
** (906.65/920.00 ft)
Capacity: 14.058/24.034 TMC

Inflow: 43878cs

(RIVER : 39047cs, MMR: 3000cs
CR @ 144.175 km: 1831cs)

OUT FLOWS: 263 cs

(Spill way: Nil, KC: Nil
(MB & EVP : 263 cs )