Heat Wave | తెలంగాణలో మండుటెండలు.. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
Heat Wave | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు ప్రతాపానికి జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 44 డిగ్రీలకు వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Heat Wave | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు ప్రతాపానికి జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 44 డిగ్రీలకు వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 20 జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పుల ప్రభావం ఉంది. ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల చివరి వరకు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అయితే పలు జిల్లాల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంది. రాత్రి వేళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏప్రిల్ 28 వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 29న తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram