ఫోర్త్ సిటీ, హైడ్రా తప్ప రేవంత్ రెడ్డికి ఇంకేం కనిపించవు : టి. జీవన్ రెడ్డి

విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందుల కథలు చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఫోర్త్ సిటీ, హైడ్రా తప్ప రేవంత్ రెడ్డికి ఇంకేం కనిపించడం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక ప్రయోజనాలు వచ్చే కార్యక్రమాలే ఇప్పుడు రేవంత్ కు కనిపిస్తున్నాయని విమర్శించారు.

విధాత, హైదరాబాద్ :  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే రీతిలో ఫీజు రీయంబర్స్ మెంట్ ఎగవేతకు సిద్దమవుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందుల కథలు చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఫోర్త్ సిటీ, హైడ్రా తప్ప రేవంత్ రెడ్డికి ఇంకేం కనిపించడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక ప్రయోజనాలు వచ్చే కార్యక్రమాలే ఇప్పుడు రేవంత్ కు కనిపిస్తున్నాయని విమర్శించారు. దివంగత వైఎస్. రాజశేఖరరెడ్డి మొదలెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ ను..తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎంతో పటిష్టంగా అమలు చేశారు అన్నారు. కాని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చి..దాన్ని పక్కన పెట్టేశారు అని జీవన్ రెడ్డి విమర్శించారు. దీంతో విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ అందక. కళాశాలల యాజమాన్యాలు వారికి ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్ధులు ఫీజులు కట్టక..ప్రభుత్వం చెల్లించకపోవడంతో కళాశాలలు సైతం ఆర్థిక భారంతో మూతపడుతున్నాయని వెల్లడించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపులపై కోర్టుల ఆదేశాలను సైతం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయకుండా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చే విధంగా జారీ చేసిన జీవో నెంబర్.7ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జీవన్ రెడ్డిని డిమాండ్ చేశారు. కళాశాలలకు రూ. 10వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించేలా చూడాలని, గతంలో మాదిరిగా పథకాన్ని అమలు చేయాలన్నారు. లేని పక్షంలో తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు.

రేవంత్ ను నమ్మకనే గాంధీలతో డిక్లరేషన్లు

రాజ్యాంగం మేరకు విద్యా, వైద్యం ప్రాథమిక హక్కులుగా పేర్కొందని..అందుకే ప్రభుత్వాలు పేద విద్యార్థుల చదువులకు ఇప్పటిదాకా సహాయం చేస్తు వచ్చాయని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పథకంలో రాష్ట్రం వాట చెల్లించపోవడంతో రూ.250కోట్ల కేంద్ర నిధులు రాకుండా పోయాయని వెల్లడించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని శాసన సభా వేదికగా ప్రకటించి అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మరన్న ఉద్దేశంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, సోనియాలతో డిక్లరేషన్లు ప్రకటింపచేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ వైద్య రంగం సైతం నిర్వీర్యం

విద్య రంగానికి నిధుల ఎగవేత మాదిరిగానే..పేదల వైద్య సహాయ పథకం రాజీవ్ ఆరోగ్య శ్రీ కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు పెరిగిపోతున్నాయన్నారు. కేసీఆర్ ప్రతి కొత్త జిల్లాల స్థాయిలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు, టిమ్స్ ఏర్పాటు చేయిస్తే వాటిని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదన్నారు. రైతు భరోసా సైతం ఎగవేస్తూ కేసీఆర్ పథకాలను రూపుమాపాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ..ప్రజలకు నష్టం చేస్తున్నాడన్నారు. రుణమాఫీ సక్రమంగా అరకొరగా అమలు చేయలేదన్నారు. పెట్టుబడి రాయితీ పథకంపై కూడా మాటమార్చారన్నారు. ఈనగాచి నక్కలపాలు అయినట్లుగా..కేసీఆర్ ఉద్యమం చేసి సాధించిన తెలంగాణలో..రేవంత్ రెడ్డి వచ్చి దొరలాగా సీఎం సీటులో కూర్చుని పేదలకు, రైతులకు అన్యాయం చేసే పాలన చేస్తున్నాడని జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకుందని, 1994లో కాంగ్రెస్ ప్రతిపక్షా హోదా కూడా దక్కలేదని, అలాంటి పరిస్థితే వచ్చే ఎన్నికల్లో మరోసారి రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ కు రాబోతుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ పోవాలని.. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ఇవ్వాళ తెలంగాణ మెజార్టీ సమాజం కోరుకుంటుందన్నారు.వ

Latest News