హైదరాబాద్: టాటా మహిళల ఎత్నిక్ వేర్ బ్రాండ్ అయిన తనైరా, పండుగ సీజన్ కోసం ‘మియారా: క్రాఫ్టెడ్ బై హ్యాండ్, రూటెడ్ ఇన్ ప్యూరిటీ’ పేరుతో సరికొత్త కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ ‘మియారా’ కలెక్షన్లో పట్టు, కాటన్ చీరలు ఉన్నాయి, వీటిని సంప్రదాయ హస్తకళ, ఆధునిక డిజైన్ల కలయికతో రూపొందించారు. ఈ కలెక్షన్ స్పెషల్ అకేషన్స్‌కు బహుమతిగా లేదా వ్యక్తిగత ఆనందం కోసం ఎంచుకునే వారికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ కలెక్షన్ విడుదల సందర్భంగా, తనైరా ‘ది గిఫ్ట్ ఆఫ్ ప్యూర్ లవ్’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా పండుగ సీజన్‌లో ప్రేమకు చిహ్నంగా చీరను బహుమతిగా ఇవ్వడాన్ని తెలియజేస్తుంది.
కస్టమర్ల కోసం తనైరా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ. 10,000 కొనుగోలుపై రూ. 1,000 విలువైన వోచర్, రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై 0.2 గ్రాముల తనిష్క్ బంగారు నాణెం లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 20, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
వీటితో పాటు, వినియోగదారులు తమకు ఇష్టమైన చీరలను కొనుగోలు చేయడానికి వీలుగా ‘గోల్డెన్ కోకూన్ ప్లాన్’ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా సులభంగా తమకు నచ్చిన చీరను సొంతం చేసుకోవచ్చు. ‘మియారా’ కలెక్షన్‌లో చీరల ధరలు రూ. 6,499 నుంచి ప్రారంభమవుతాయి.
హైదరాబాద్‌లోని తనైరా షోరూమ్‌లైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, కొంపల్లి, గచ్చిబౌలిలోని లీ మెరిడియన్, సెరిలింగంపల్లి, రంగారెడ్డిలలో ఈ కొత్త ‘మియారా’ కలెక్షన్ అందుబాటులో ఉంది.