Telangana Bans Two Cough Syrups | తెలంగాణలో రెండు దగ్గు మందుల నిషేధం

కల్తీ కారణంగా తెలంగాణలో ‘రిలీఫ్‌’, ‘రెస్పీఫ్రెష్-టీఆర్’ అనే రెండు దగ్గు మందుల విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. విక్రయించవద్దని హెచ్చరిక.

Telangana Bans Two Cough Syrups | తెలంగాణలో రెండు దగ్గు మందుల నిషేధం

విధాత, హైదారబాద్ : తెలంగాణలో రెండు దగ్గు మందుల విక్రయాలను ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రీలీఫ్‌, రెస్పీఫ్రెష్-టీఆర్‌ సిరప్ అనే రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించడం జరిగిందని..ప్రాణాంతకమైన ఈ దగ్గు మందులను ఎవరూ విక్రయించవద్దని..చట్ట విరుద్దంగా విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్‌రిలీఫ్ సిరప్ కారణంగా 16 చిన్నారుల మరణాలు చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఔషద నియంత్రణ శాఖ(డీసీఏ) కోల్డ్ రిలీఫ్ మందును నిషేధించింది. తాజాగా రిలీఫ్‌, రెస్పి ఫ్రెస్‌-టీఆర్ సిరప్‌లపై నిషేధం విధించింది. ఈ రెండు సిరప్‌లలో కల్తీ జరిగిందని తేలడంతో వాటి విక్రయాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దగ్గు మందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. పిల్లల్లో సాధారణంగా దగ్గు, జలుబు వచ్చినప్పుడు తగిన నివారణ చర్యలతోనే కట్టడి చేయవచ్చని.. వెంటనే తగ్గిపోవాలని ఎడాపెడా మందులను వాడితే చిన్నారుల ప్రాణాలకే ప్రమాదమని ప్రజారోగ్య విభాగం హెచ్చరించింది. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందు ఇవ్వద్దని సూచించింది. ఐదేళ్లలోపు చిన్నారులకు అత్యవసరమైతేనే దగ్గు మందు వాడాలని పేర్కొంది.