Telangana CS |  తెలంగాణ సిఎస్​ పదవీకాలం మరో 7 నెలలు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పదవీకాలాన్ని మరో ఏడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • By: Tech |    telangana |    Published on : Aug 29, 2025 12:04 AM IST
Telangana CS |  తెలంగాణ సిఎస్​ పదవీకాలం మరో 7 నెలలు పొడిగింపు

Telangana CS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు(K Ramakrishna Rao IAS) పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడగించడానికి  కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సిన సి.ఎస్ రామకృష్ణారావు పదవిని పొడిగించాల్సిందిగా  రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ప్రధాన కార్యదర్శి పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా రామ కృష్ణారావు పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడిగించడానికి అంగీకరించింది. దీనికి అధికారముద్ర వేస్తూ Department of Personnel and Training (DOPT) ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా రామకృష్ణారావు మార్చి31, 2026 వరకు పదవిలో కొనసాగనున్నారు.