DGP Jitender | సామాన్యులకు పోలీసుల పేరుతో వల విసురుతున్న నేరగాళ్లు.. వీడియోను షేర్‌ చేసిన డీజీపీ

DGP Jitender | ఇటీవల కాలంలో సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలను ఎంచుకుంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తాము పోలీసుల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి సొమ్ము చేసుకుంటూ నయా మోసానికి తెరలేపారు.

DGP Jitender | సామాన్యులకు పోలీసుల పేరుతో వల విసురుతున్న నేరగాళ్లు.. వీడియోను షేర్‌ చేసిన డీజీపీ

DGP Jitender | ఇటీవల కాలంలో సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలను ఎంచుకుంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తాము పోలీసుల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి సొమ్ము చేసుకుంటూ నయా మోసానికి తెరలేపారు. ఈ క్రమంలో కొత్త రకం మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా తెలంగాణ డీజీపీ జితేందర్‌ ఓ వీడియోను ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు. సైబర్‌ నేరగాళ్ల మాయలో పడొద్దంటూ సూచించారు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఫోన్ల నుంచి టార్గెట్‌ వచేసిన వ్యక్తులను బెదరగొట్టే ప్రయత్నం చేస్తారన్నారు. మొబైల్‌ డీపీలో యూనిఫాంలో ఉన్న ఓ ఆఫీసర్‌ ఫొటోను పెట్టుకుంటారని.. దాంతో జనాలు ఫోన్‌ లిఫ్ట్‌ చేసే సమయంలో నిజంగానే పోలీసులని భావిస్తూ భయపడి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తారని.. తమ మాటలతో వారిని మరింత భయాందోళనకు గురి చేస్తూ వచ్చిన కాడికి డబ్బులను రాబట్టుకుటారని డీజీపీ వివరించారు.

డీజీపీ ట్వీట్‌ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తికి అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ వస్తుంది. తాను ముంబయి పోలీస్‌నని చెప్పుకొని.. మీ కొడుకు రేప్‌ కేసులో పట్టుబడ్డాడని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే మీ అబ్బాయి జీవితం నాశనమవుతుందని మాటల్లో పెట్టి.. కేసు వద్దంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం కనిపించింది. ఫోన్‌ ఎత్తిన వ్యక్తికి అనుమానం రావడంతో ఎక్కడ ? ఎప్పుడు జరిగింది ? మీరు ఏ స్టేషన్‌లో పని చేస్తున్నారంటూ ఆరా తీయగా సదరు వ్యక్తి ఫోన్‌ పెట్టేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేసిన సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. ఈ క్రమంలో డీజీపీ ఆ వీడియోను షేర్‌ చేశారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసినా కుటుంబీకులు, తెలిసిన వ్యక్తులు నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కారని.. మీ పేరుమీద కార్గోలో డ్రగ్స్‌ కొరియర్స్‌ వచ్చాయని.. కస్టమ్స్‌ తనిఖీల్లో దొరికాయని ఫోన్లు చేస్తే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ సూచించారు.