498 మంది ఉద్యోగులు తెలంగాణలో సర్దుబాటు
హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.