కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ
కాళేశ్వరం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా నివేదిక లక్ష్యం.
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. పరిచిత్ మోహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. వర్షాకాలం ముందే జియో టెక్నికల్ పరిశీలన పనులు పూర్తి చేయాలని, మే 30లోగా పరిశీలనను పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. రోజువారి పురోగతి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. సీఎంతో చర్చించిన పిదప..ఆయన సూచనల మేరకు బ్యారేజీల మరమ్మతుల పనులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటిపారుదల రంగ నిపుణుడు కర్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా అత్యున్నత స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీడబ్ల్యుసీ, ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీల మరమ్మతు పనులను లోపాలు లేకుండా పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ), విజిలెన్స్ కమిషన్ తదితర చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించాయని ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ మూడు బ్యారేజీల్లోనూ సమస్యలు ఒకేవిధంగా ఉన్నాయని,. వీటి మరమ్మతుల ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాలను అధికారులు కీలకంగా పరిగణించాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయి. అదే సమయంలో మేడిగడ్డ కొంత భాగాన్నీ పూర్తి చేస్తామన్న నమ్మకం ఉందన్నారు. బ్యారేజీల పునరావాస డిజైన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆఫ్రి ఇండియాకు బాధ్యతలు అప్పగించిందని తెలిపారు.
వారం రోజుల్లో డిజైన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, ఆ తర్వాత వెంటనే వాటిని కేంద్ర జల సంఘా(సీడబ్ల్యూసీ)నికి పంపించి ఆమోదం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్మాణ సంస్థలు ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే నీటిపారుదలశాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, కర్నల్ పరీక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదించవచ్చని తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిజైన్ల ప్రక్రియకు సంబంధించి భూభౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహించాలని, బ్యారేజీల వద్ద పరీక్షలు, అధ్యయనాలు చేపడుతున్న పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) సిబ్బంది ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల సంఘంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. 45 రోజులపాటు నిరంతరం పరీక్షలు నిర్వహించేలా బ్యారేజీల ప్రాంతాల్లోనే ఉండాలని, వారికి నిర్మాణ సంస్థలు పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు. ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
మూసీ సుందరీకరణకు కార్తీక్ రెడ్డి ఎన్‌జీటీ పిటిషన్ బ్రేక్ లు !
బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram