సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మృతి
సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మృతి చెందిన ఘటన వివాదస్పదమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిని పేషీలో ఔట్ సోర్సింగ్ కింద 11 ఏండ్లుగా పనిచేస్తున్న
విధాత, హైదరాబాద్ : సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మృతి చెందిన ఘటన వివాదస్పదమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిని పేషీలో ఔట్ సోర్సింగ్ కింద 11 ఏండ్లుగా పనిచేస్తున్న రాహుల్ ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అకస్మాత్తుగా కింద పడిపోవడంతో వెంటనే స్పందించిన సహచర సిబ్బంది అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తరలించినప్పటికి డబ్బులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో నిమ్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.
అక్కడ వైద్యులు గుండె శస్త్ర చికిత్స ఆపరేషన్‌తో పాటు డయాలసిస్ చేయగా ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 48 గంటల అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత గురువారం రాత్రి 9 గంటలకు రాహుల్ మృతి చెందాడు. 33 సంవత్సరాల రాహుల్ పురాణ పుల్‌కు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రాణి కుమిదిని సీరియస్‌గా మందలించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉంటుందని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సెక్రటేరియట్ ఉద్యోగులు సీఎస్ శాంతి కుమారిని కలిసి, రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram