Telangana snake rescues | ఈ ఏడాది ఇప్పటి వరకూ తెలంగాణలో రక్షించిన పాముల సంఖ్య ఎంతో తెలుసా?

Telangana snake rescues | ఈ ఏడాది ఇప్పటి వరకూ తెలంగాణలో రక్షించిన పాముల సంఖ్య ఎంతో తెలుసా?

Telangana snake rescues | తెలంగాణ అటవీశాఖ సహకారంతో ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకూ తెలంగాణ వ్యాప్తంగా 5,954 పాములను పట్టుకున్నామని ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ (Friends of Snakes Society – FOS) తెలిపింది. వీటిలో 56 శాతం (3,337) పాములు విషపూరితమైనవి ఉన్నాయని వెల్లడించింది. మిగిలినవి విషరహితమైనవని పేర్కొన్నది. రక్షించిన పాములను వాటికి తగిన అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాలైన మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్‌లలో ఎక్కువ పాములను రక్షించినట్టు FOS ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ విశ్వనాథన్‌ తెలిపారు. విషపూరితమైన పాముల్లో 2,970, నాగుపాములు, 344 రక్త పింజరలు, 23 కామన్‌ క్రెయిట్స్‌ జాతి పాములు ఉన్నాయని తెలిపారు. విషరహిత పాముల్లో అత్యధికంగా ఇండియన్‌ ర్యాట్‌ స్నేక్‌, చెకర్డ్‌ కీల్‌బ్యాక్‌, బ్రాంజ్‌బ్యాక్‌ ట్రీ స్నేక్‌తోపాటు.. కొండచిలువ, రెడ్‌శాండ్‌ బోయా, బార్డ్‌ వూల్ఫ్‌స్నేక్‌ వంటి జాతులు ఉన్నాయని వివరించారు.

పాములను పట్టుకొని, సురక్షిత ప్రదేశాల్లో వదిలిపెట్టడమే కాకుండా.. పాములపై అవగాహన కల్పించేందుకు 200కుపైగా వర్క్‌షాప్‌లను నిర్వహించామని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, పోలీసు, ఫారెస్ట్‌ అకాడమీలు, వివిధ గ్రామీణ సంస్థల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లకు సుమారు 40వేల మంది హాజరయ్యారని అవినాశ్‌ విశ్వనాథన్‌ వివరించారు. పాముల పర్యావరణ సమతుల్యానికి ఎంత అవసరమో ఈ వర్క్‌షాప్‌లో ప్రధానంగా తెలియజేశామన్నారు. పాములు కనిపించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాము కాట్లకు గురైనవారికి చేయాల్సిన ప్రాథమిక చికిత్స, పాముల విషయంలో మూఢనమ్మకాలు, అపోహలు తొలగించడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్‌లు కొనసాగాయని తెలిపారు. పాములు కనిపిస్తే సొసైటీకి చెందిన 24/7 హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8374233366కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చు. మరిన్ని వివరాలకు https://friendsofsnakes.org.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

పాములకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర కథనాలకోసం వీటిని క్లిక్‌ చేయండి

World Snake Day | పాము చెబుతున్న ఆత్మకథ.. నేడు అంతర్జాతీయ పాముల దినోత్సవం
Protection from Snakes | పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఈ మొక్క‌లు పెంచండి మ‌రి..
Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
Cobra Dry Bites | కోబ్రా కాట్లన్నీ విషపూరితమేనా? వాటి విషం, పొడి కాట్ల వెనుక రహస్యాలేంటి?
Cobra Dry Bites | కోబ్రా కాట్లన్నీ విషపూరితమేనా? వాటి విషం, పొడి కాట్ల వెనుక రహస్యాలేంటి?