తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే… మార్పుల తర్వాత సరికొత్తగా ‘జయ జయహే తెలంగాణ’ పూర్తి పాట..
తెలంగాణ రాష్ట్ర గీతం సిద్ధం..! మార్పుల తర్వాత సరికొత్తగా 'జయ జయహే తెలంగాణ' పూర్తి పాట
విధాత, హైదరాబాద్ :
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ..జైజై తెలంగాణ..
జై తెలంగాణ..జైజై తెలంగాణ
జానపద జనజీవన జావళీలు జాలువార
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అను నిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ..జైజై తెలంగాణ
జై తెలంగాణ..జైజై తెలంగాణ
గోదావరి కృష్ణమ్మలు..తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ ..జైజై తెలంగాణ
జై తెలంగాణ..జైజై తెలంగాణ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram