Check Power : బిగ్ బ్రేకింగ్..ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు..పునరుద్దరణ
తెలంగాణలో ఉప సర్పంచ్‌ల 'చెక్ పవర్' వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. తొలుత రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, కొద్దిసేపటికే మళ్లీ పునరుద్ధరిస్తూ సవరించిన జివో జారీ చేసి నవ్వులపాలైంది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరికొంత సేపటికే మళ్లీ ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ పునరుద్ధరిస్తూ పంచాయతీ రాజ్ శాఖ సవరించిన ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉప సర్పంచ్ ల చెక్ పవర్ వ్యవహారంలో ప్రభుత్వం నవ్వుల పాలైంది.
సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఉండటంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఉప సర్పంచ్ పదవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతోపాటు ఉప సర్పంచ్‌కు కూడా ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటంతో ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసిరాని చోట ఆశావహులు వార్డు మెంబర్‌గా పోటీ చేసి.. గెలిచి, ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవడంతో పోటీ పడ్డారు.
గతంలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేయాలంటూ సర్పంచ్‌లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడ్డారు. ఈ గొడవ అంతా ఎందుకనుకుందో ఏమో గాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ ల జాయింట్ చెక్ పవర్ రద్దు చేసింది. అంతలోనే తిరిగి మళ్లీ చెక్ పవర్ పునరుద్ధరిస్తూ సవరించిన ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
Aliens Exist | గ్రహాంతరవాసుల జాడ తెలిసేది ‘ఆ సంవత్సరం’లోనే .. బ్రిటన్ శాస్త్రవేత్త ధీమా
Swiggy : భారతీయుల క్రేజీ ఫుడ్ బిర్యానీ..పదేళ్లుగా నెంబర్ వన్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram