TG |తుమ్మబాల సేవలు చిరస్మణీయం సీఎం రేవంత్‌రెడ్డి
సమాజ నిర్మాణంలో ఆర్చ్ బిషప్ తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
విధాత, హైదరాబాద్ : సమాజ నిర్మాణంలో ఆర్చ్ బిషప్ తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్‌లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్ధీవ దేహానికి నివాళులు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, మతసామరస్యం, విద్యను తుమ్మబాల ప్రజలకు అందించారన్నారు. వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. వారి సేవలను కొనియాడుతూ వారి సందేశం స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram