Skill University | అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన : మంత్రి శ్రీధర్ బాబు
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు
విధాత, హైదరాబాద్ : స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంగళవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక ప్రణాళికల వ్యూహాత్మక పెట్టుబడిగా శ్రీధర్ బాబు అభివర్ణించారు.ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న యూనివర్సిటీగా చెప్పారు. ఈ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన దిశగా సర్కారు ముందడుగు వేసిందని మంత్రి చెప్పుకొచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram