Nagarjuna | మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ఫైర్
Nagarjuna | రాష్ట్ర మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున( Nagarjuna ) ఎక్స్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ చేసిన తన కుటుంబం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం అని నాగార్జున పేర్కొన్నారు.
Nagarjuna | హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాగార్జున్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాగచైతన్య( Naga Chaitanya ) విడాకులకు కేటీఆరే( KTR ) కారణమన్న వ్యాఖ్యలను నాగార్జున( Nagarjuna ) తీవ్రంగా ఖండించారు. ఎన్ కన్వెన్షన్ హాల్( N Convention Hall ) కూల్చొద్దంటే.. సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ నాగార్జున వద్ద డిమాండ్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. నాగార్జున కూడా సమంతను ఒత్తిడి చేస్తే ఆమె విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున తీవ్రంగా స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని కొండా సురేఖకు చెప్పారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
గతంలో ఇదే కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్. నాగచైతన్య – సమంత విడాకులకు కూడా కేటీఆర్ కారణం. కొంతమంది హీరోయిన్లు సినిమాల నుంచి తప్పుకోవడానికి కూడా కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నాడు కేటీఆర్. నీవు తల్లికి పుట్టలేదా.. పెళ్లి చేసుకోలేదా.. పిల్లలను కనలేదా.. మనిషివి కాదా..? అని కేటీఆర్‌పై కొండా సురేఖ మండిపడ్డారు.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram