• Telugu News
  • /Telangana

సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్ పర్ట్ కమిటీకి సన్మానం

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే నివేదిక రూపొందించిన ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులను మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 17, 2026, 1:25 pm IST
Read Time: 2 mins
సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్ పర్ట్ కమిటీకి సన్మానం

విధాత, హైదరాబాద్ : సామాజిక, రాజకీయ, ఆర్థిక కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి సరిగా సర్వే నిర్వహించిన సందర్భంగా ప్రభుత్వం నియమించిన ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ మాజీ సుప్రీం కోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచ అయిలయ్యని శుక్రవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

వారి నివాసానికి వెళ్లి సామాజిక, రాజకీయ, ఆర్థిక కుల గణన నివేదికపై కమిటీ చేసిన కసరత్తుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ఆర్థిక సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేందుకు కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని వారు వెల్లడించారు. పారదర్శకంగా, శాస్ట్రీయంగా, పకడ్బందీగా నివేదిక తయారు చేశారని ఈ సందర్భంగా వారు అభినందించారు.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ లో సూర్య ప్రతాపం !
డెసిషన్ డే.. మూడు బిల్లులపై నేడు ఓటింగ్