Tenth Results | 30న లేదా మే 1న టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌..!

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల విడుద‌లకు కూడా విద్యాశాఖ అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ నెల 30న లేదా మే 1వ తేదీన టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Tenth Results | 30న లేదా మే 1న టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌..!

హైద‌రాబాద్ : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల విడుద‌లకు కూడా విద్యాశాఖ అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ నెల 30న లేదా మే 1వ తేదీన టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించారు. 5,08,385 మంది విద్యార్థులు ప‌ది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఈ ప్ర‌శ్న‌ప‌త్రాల మూల్యాంక‌న శ‌నివారం పూర్త‌యింది. వారం రోజుల పాటు ఫ‌లితాల డీకోడింగ్ అనంత‌రం ఈ నెల 30న లేదా మే 1వ తేదీన ఫ‌లితాల‌ను విడుద‌ల చేయాల‌ని విద్యాశాఖ భావిస్తోంది.